Home > జాతీయం > నడిరోడ్డులో బైక్‌పై రొమాన్స్..తిక్క కుదిర్చిన పోలీసులు

నడిరోడ్డులో బైక్‌పై రొమాన్స్..తిక్క కుదిర్చిన పోలీసులు

నడిరోడ్డులో బైక్‌పై రొమాన్స్..తిక్క కుదిర్చిన పోలీసులు
X

సోషల్ మీడియా యుగంలో కొంతమంది యువతీ, యువకులు బరితెగిస్తున్నారు. నాలుగు గోడలు మధ్య జరగాల్సిన పనులను నడిరోడ్డుపైనే కానిచ్చేస్తున్నారు. ఇటీవల కాలంలో పబ్లిక్‌లో బైక్ పై ప్రేమికుల సరసాలు సర్వసాధరణమైపోయాయి. ఇప్పటికే చాలా ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా యూపీలో ఓ జంట బహిరంగానే రెచ్చిపోయిన దృశ్యాలు రెండు రోజులుగా సోషల్ మీడియలో చక్కర్లు కొడుతున్నాయి.

ఓ యువకుడు బైక్ నడుపుతుండగా, అతడికి వ్యతిరేక దిశలో ఓ యువతి కూర్చొంది. అతడిని గట్టిగా కౌగిలించుకుని కనిపించింది. ఆ సమయంలో యువకుడు బైక్‌‌‌ను పోనిస్తున్నాడు. విచిత్ర భంగిమల్లో వీరు చేసిన పనులకు వాహనదారులు ఆశ్చర్యపోయారు. పైగా ఇద్దరికీ హెల్మెట్లు లేవు. ఈ తతంగాన్ని వారి వెనుక కారులో వెళుతున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‎లోని జాతీయ రహదారి 9 పై ఈ దృశ్యం దర్శనమిచ్చింది.

సోషల్ మీడియాలో మీడియోలో వైరల్ ఈ వీడియోను పలువురు నెటిజన్లు ఘజియాబాద్ పోలీసులకు ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ట్విట్టర్ నుంచి అందిన ఫిర్యాదల మేరకు ఆ వాహనదారుడికి పోలీస్ శాఖ రూ.21,000 చలానా విధించింది. ఇందుకు సంబంధించిన ఫొటోని పోలీసులు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారీ జరిమాన విధించి తిక్క కుదిర్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Updated : 23 Jun 2023 1:39 PM GMT
Tags:    
Next Story
Share it
Top