Home > జాతీయం > Ayodhya : సీతమ్మ పుట్టింటి నుంచి అయోధ్య రామయ్యకు కానుకలు

Ayodhya : సీతమ్మ పుట్టింటి నుంచి అయోధ్య రామయ్యకు కానుకలు

Ayodhya : సీతమ్మ పుట్టింటి నుంచి అయోధ్య రామయ్యకు కానుకలు
X

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శోభ దగ్గర పడుతున్న కొద్దీ.. భక్తుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి రామునికి కానుకలు వెల్లువెత్తుతున్నారు. అల్లుడికి ఎన్నికానుకలు వచ్చినా.. అత్తింటి కానుకలు చాలా ప్రత్యేకం అన్నట్లు, రాముడికి కానుకలు వస్తున్నాయి. సీతమ్మ జన్మించిన నేపాల్ లోని జనక్ పుర్ నుంచి వందలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. రాముడికి బంగారు, వెండి కానుకలు, ఆభరణాలు సమర్పిస్తున్నారు. దాదాపు 800 మంది భక్తులు 500 కానుకలు తీసుకొచ్చారు. జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో తామెంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

త్రేతాయుగంలో రాముడికి, సీతమ్మకు స్వయంవరం జరిగింది తమ వద్దే అని గుర్తుచేసుకున్నారు. భక్తులు తీసుకొచ్చిన కానుకల్లో బంగారం, వెండి ఆభరణాలతో పాటుస స్వీట్లు, పల్లు, డ్రైఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఆ కానుకల్లో వెండి పాదరక్షలు, విల్లు, బాణం, కంఠహారాలు, పట్టు వస్తాలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. సీతారాముల స్వయంవర వివాహంలో జనకుడు ఎన్నో కానుకలు పంపాడని.. అదే సంప్రదాయాన్ని తాము కూడా పాటిస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు. కాగా బనారస్ చీరలపై రామ మందిర చిత్రాలు ముద్రించాలని, ప్రాణ ప్రతిష్ట జరిగేరోజు తమను డెలివరీ చేయాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.




Updated : 9 Jan 2024 3:47 PM IST
Tags:    
Next Story
Share it
Top