Ayodhya Ram Mandir : రామమందిర నిర్మాణానికి భారీగా విరాళాలు సేకరించిన బాలిక
X
అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ బాలిక ఉడత భక్తిగా 52 లక్షల విరాళాలను సేకరించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక భవికా మహేశ్వరి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోందని,దాని కోసం ప్రజలు తమకు తోచినంతలో కానుకలు ఇస్తున్నారని తెలుసుకుంది. దేవుడి మీద భక్తితో తాను కూడా ఆలయ నిర్మాణానికి సహాయం అందించాలని అనుకుంది.రామాయణం మీద ఉన్న ఆసక్తితో బాలరాముడి కథలు చదివటం ప్రారంభించింది. ఆ కథలను కొవిడ్ సెంటర్స్, బహిరంగ సభల్లో గురించి ప్రజలకు చెప్పింది.
2021లో ఓ జైలులో ఉన్న ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రామమందిరం నిర్మాణానికి రూ.లక్ష విరాళం ఇచ్చారు. అలా భవికా తాను 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి 300 పైగా ప్రదర్శనలు చేసింది. వాటి ద్వారా మొత్తంగా రూ.52 లక్షల వరకు సేకరించి, ఆ నగదును అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది.శ్రీరాముడిగాథని ప్రజలకు వివరించి, సోషల్ మీడియాలో 108కి పైగా వీడియోలను రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. అంతేకాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఒక బుక్ రాసింది