Home > జాతీయం > Supreme Court : పోలీసుల ఓవరాక్షన్.. జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు

Supreme Court : పోలీసుల ఓవరాక్షన్.. జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు

Supreme Court : పోలీసుల ఓవరాక్షన్.. జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు
X

2022లో గుజరాత్ రాష్ట్రం ఖేడా జిల్లాలోని ఓ గ్రామంలో ముస్లిం వర్గానికి చెందిన ఐదుగురు వ్యక్తులను బహిరంగంగా కొరడాలతో కొట్టిన ఘటనపై సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్తంభానికి కట్టేసి కొట్టే అధికారం ఎవరిచ్చారని నిలదీసింది. నిర్బంధం, అనుమానితుల విచారణలకు సంబంధించి సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన మార్గదర్శకాలను పట్టించుకోనందుకు కోర్టు ధిక్కారంగా పరిగణిస్తూ గుజరాత్‌ హైకోర్టు నలుగురు పోలీసులకు 14 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. అక్టోబర్ 19, 2023 నాటి గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇన్‌స్పెక్టర్ ఎవి పర్మార్, సబ్-ఇన్‌స్పెక్టర్ డిబి కుమావత్, హెడ్ కానిస్టేబుల్ కెఎల్ దాభి మరియు కానిస్టేబుల్ ఆర్‌ఆర్ దాభి చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించింది. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు వారికి 14 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. సదరు ముస్లిం యువకులను స్తంభానికి కట్టేసి కొట్టడానికి మీకు చట్టం ప్రకారం అధికారం ఉందా ? అని ప్రశ్నించిన సుప్రీం.. 14 రోజుల జైలు శిక్షను ఎంజాయ్ చేయండంటూ తీర్పునిచ్చింది. మీరు పనిచేసే చోట మీరే అతిథులుగా చేరండని, మీకు ప్రత్యేక ఆతిథ్యం కూడా దొరుకుతుందని వ్యాఖ్యానించింది.

గా 2022 అక్టోబరులో జరిగిన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖేడా జిల్లాలోని ఉంధేలా గ్రామంలో ఒక గర్బా కార్యక్రమంలో రాళ్లు రువ్వినందుకు 13 మంది వ్యక్తులలో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది గ్రామస్తులు, పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఐదుగురు ముస్లిం అనుమానిత నిందితులను పోలీసులు స్తంభానికి కట్టివేసి, లాఠీలతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్‌ అయ్యింది. అనుమానితుల అరెస్ట్‌ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి, కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని పేర్కొంటూ ప్రధాన ఫిర్యాదుదారు జాహిర్మియా మాలెక్‌తో సహా ఐదుగురు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తొలుత 13 మంది పోలీసులను నిందితులుగా చేర్చారు. అయితే విచారణ అనంతరం వీరిలో ఐదుగురి పాత్ర కీలకమని సీజేఎం పేర్కొంది.




Updated : 24 Jan 2024 11:14 AM IST
Tags:    
Next Story
Share it
Top