భగ్గుమన్న బంగారం..పెళ్లికి ఏం పెట్టుకు పోయేది
X
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. బ్రేక్ తీసుకోకుండా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. శ్రావణ మాసానికి తోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలనుకునేవారికి ఇది పెద్ద ఝలక్ అని చెప్పక తప్పదు. కనీసం కాసు బంగారం అయినా కొనాలనుకునే సామాన్యుల కోరికలు పెరిగిన పసిడి ధరలతో ఆవిరైపోతున్నాయి. పసిడి ధరలకు తోడు వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో వెండి కొనే వారికి కూడా షాక్ తగిలినట్లైంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ రిటైల్ మార్కెట్లలో 22 క్యారెట్ల బంగరాం ధర 10 గ్రాములకు నిన్నటితో పోలిస్తే రూ.300 మేర పెరిగింది.24క్యారెట్ల బంగారం ధర రూ. 330 మేర దూసుకుపోయింది. దీంతో బంగారం ధర ఒక్కసారిగా రూ. 60 వేలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి ఈ లేటెస్టు ధరలు వర్తించనున్నాయి.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55 వేలకు పెరిగింది.
ఇదిలా ఉంటే బంగారం ధరలకు జీఎస్‌టీ పడుతుంది. అంతే కాకుండా మేకింగ్ చార్జీలు ఉంటాయి. పెరిగిన బంగారం ధరలకు తోడు ఇవి అదనం కావడంతో పెళ్లిళ్ల సీజన్ ముందుడటంతో ఏం కొనాలన్నా వినియోగధారులు భయపడిపోతున్నారు. ఇక వెండి ధరలు మరింత పెరిగాయి. వెండి ధర ఈ రోజు రూ. 700 దగ్గర దూసుకుపోయింది. కిలోపై రూ.500 వరకు వెండి ధరలు పెరిగాయి. దీంతో వెండి ధర రూ. 80,700కు పెరిగింది.