Gold and Silver Prices : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
X
పసిడి ప్రియులకు ఇది చేదు వార్త. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు బ్రేక్ తీసుకోకుండా పెరుగుతూ పోతున్నాయి. పండగల సీజన్ కావడంతో బంగారం కొనాలనుకునేవారికి పెరిగిన ధరలు భారంగా మారుతున్నాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర 600 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధర 660పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,400 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 660 పెరిగి 62,620గా ఉంది. అటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక వెండి రేట్లలో ఎటువంటి మార్పు లేదు. కిలో వెండి 77,500గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 600 పెరిగి.. 57,550గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 65,770గా ఉంది. అయితే ఢిల్లీలో వెండి ధరలు హైదరాబాద్ కన్నా తక్కువగా ఉన్నాయి. అక్కడ కేజీ వెండి ధర 74,600 రూపాయలుగా ఉంది. ప్రధాన నగరాల్లో ధరలు.. చెన్నైలో 22క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా.. 24క్యారెట్ల బంగారం ధర 62,950గా ఉంది. కాగా నాగపూర్, మైసూర్ పట్టణాల్లో హైదరాబాద్ ధరలే ఉన్నాయి.