Today Gold And Silver Rates : బంగారం ధరలు ఢమాల్... వెండిదీ అదే దారి..
Mic Tv Desk | 27 Sept 2023 5:36 PM IST
X
X
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశంలో డిమాండ్ దగ్గడం, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ఫలితంగా పసిడి ధర బుధవారం కూడా పడిపోయింది (Gold And Silver Rates Down ). హైదరాబాద్ మార్కెట్ల్ 22 కేరట్ల బంగారం రేటు 10 గ్రాములకు 250 తగ్గి రూ. 54,500కు పడిపోయింది. 24 కేరట్ల మేలిమి బంగారం ధర రూ. 280 తగ్గి రూ. 59,450కు చేరుకుంది. మరోపక్క వెండి ధరలు కూడా దిగి వస్తున్నాయి. కేజీ రూ. 77,600 నుంచి రూ. 600 తగ్గి రూ. 77,000లకు చేరుకుంది. డాలర్ సూచీ బలం పుంజుకోవడంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో పసిడిపై నష్టాలు వస్తున్నాయి. మంగళవారం 1.59 శాతం నష్టం వాటిల్లింది. నెలల వ్యవధిలో బంగారం రేట్లు కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల మరింత పెంచే యోచనలో ఉండడంతో మదుపర్ల బంగారానికి బదులు షేర్లపై మొగ్గుచూపుతున్నారు.
Updated : 27 Sept 2023 5:36 PM IST
Tags: Gold And Silver Rates Down Gold Rates Down Due To Doller Value Rise Doller Value Today Gold Price Latest Gold Price Rate Today gold rate today silver rate Gold and silver rates dollar value rising USA federal bank interest rates gold mcx rates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire