Home > జాతీయం > భగ్గున మండిన బంగారం... రేపోమాపో 70 వేలు!

భగ్గున మండిన బంగారం... రేపోమాపో 70 వేలు!

భగ్గున మండిన బంగారం... రేపోమాపో 70 వేలు!
X

బంగారంపై సామాన్యులే కాదు, మధ్య తరగతి ప్రజలు కూడా ఇక ఆశ వదిలేసుకోక తప్పదు! పసిడి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. బుధవారం బులియన్ మార్కెట్ చుక్కలు చూపించింది. బంగారం ధర భారీగా జంప్ చేసింది. హైదరాబాద్ మార్కెట్లో 24 కేరట్ల మేలిమి బంగారం పది గ్రాములకు రూ. 820 పెరిగి రూ. 63,380కు చేరుకుంది. గత నాలుగైదు నెలల్లో ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి. 22 కేరట్ల బంగారం ధర కూడా రూ. 750 పెరిగి రూ. 58,100కు చేరుకుంది. ధరల జోరుగా ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా బంగారం ధర రూ. 65 వేల నుంచి రూ. 70వేలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క వెండి ధరలు కూడా ముట్టుకుంటే కాలిపోయేలా వేడెక్కుతున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 700 పెరిగి రూ. 81,200కు చేరుకుంది.

ఎందుకు పెరుగుతున్నాయ్?

ప్రపంచ ద్రవ్య వ్యవస్థకు ప్రామాణికంగా భావించే అమెరికా డాలర్ ధర గత మూడు నెలల్లో కనీస స్థాయికి పడిపోయింది. బ్యాంకులు చెల్లించే వడ్డీరేట్లు కూడా భారీగా తగ్గుతున్నాయి. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం రాకపోవడంతో మదుపర్లు బంగారాన్ని భారీగా కొంటున్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికమాంద్యం వంటి అంతర్జాతీయ సమస్యలు కూడా విపణిని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారానికి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. దేశవిదేశాల్లో పండగల సీజన్ కూడా కావడంతో గత రెండు నెలలుగా పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.

Updated : 29 Nov 2023 12:51 PM IST
Tags:    
Next Story
Share it
Top