మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
X
మహిళలకు అదిరే శుభవార్త. గత పది రోజులుగా బంగారం, వెండి ధరలు కుప్పకూలుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఏకంగా 6 నెలల కనిష్టానికి బంగారం ధరలు పడిపోవడం విశేషం. గోల్డ్ రేట్ గత పది రోజుల్లో సుమారుగా రూ.2500 వరకూ తగ్గింది. కిలో వెండి రేటు సైతం రూ. 3000 వరకు తగ్గింది. ఆశించిన డిమాండ్, ఆదరణ లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా వీటి ధరలు భారీగా పడిపోవడం.. ప్రస్తుత ధరలు తగ్గడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 3వ తేదీ మంగళవారం బంగారం రూ. 600 తగ్గింది. ఇక అక్టోబర్ 4 న కూడా పది రూపాయలు తగ్గి ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,370కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,590పలుకుతోంది.
పండుగల వేళ బంగారం, వెండి కొనాలనుకుంటున్నారో వారికి ఇదే మంచి ఛాన్స్‌గా చెప్పవచ్చు. వెండి రేటు సైతం భారీగా పడిపోయింది. మన దేశంలో పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా విక్రయాలు జరుగుతాయి. ఈసారి రేట్లు దిగివస్తున్నాయి. కాబట్టి కొనుగోళ్లకు ఎక్కువ మొగ్గు చూపుతారని జువెలర్స్ ఆశిస్తున్నారు. మరి చూడాలి ఈసారి డిమాండ్ పెరుగుతుందో లేదో. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.600 కు తగ్గి రూ. 52,600 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.660 కు తగ్గి రూ.57,380 గా ఉంది.