Home > జాతీయం > బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..ఇకపై వారానికి 5 రోజులే పని

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..ఇకపై వారానికి 5 రోజులే పని

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..ఇకపై వారానికి 5 రోజులే పని
X

భారత్‎లోని బ్యాంక్ ఉద్యోగులు త్వరలో ఓ శుభవార్తను విననున్నారు. సుదీర్ఘకాలంగా బ్యాంకు ఉద్యోగులు వినిపిస్తున్న తమ పాత డిమాండ్‌ను నెరవేర్చేందుకు కేంద్ర సర్కార్ సిద్ధమవుతోంది. దీంతో ఇకపై కార్పొరేట్ ఉద్యోగుల తరహాలో బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పనిచేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వానికి ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే వారంలో ఐదు రోజులు పని దినాలను చేసి అందుకు బదులుగా ప్రతి రోజూ 40 నిమిషాలు ఎక్స్‎ట్రా వర్క్ చేయాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. బ్యాంకు ఉద్యోగుల పని దినాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందకు జులై 28న యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్స్‌ యూనియన్స్‌‎తో ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ సమావేశం కానుంది. త్వరలో అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల అయ్యే ఛాన్స్ ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగుల పనిదినాలను వారానికి 5 రోజులుగా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే వరుసలో ఇప్పుడు బ్యాంకులకూ ఇదే విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని జులై 19న నిర్వహించిన సమావేశంలో యూబీఎఫ్‌ఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల పనిదినాలతో పాటు వారి జీతాల పెంపు, పదవీ విరమణ చేసిన వారికి ఆరోగ్య బీమా పాలసీ వంటి అంశాలపైనా చర్చలు జరిపింది. ఇవే అంశాలపైన రానున్న వారం రోజుల్లో రెండు వర్గాలూ మరోసారి చర్చలు జరపనున్నాయి.

జులై 28న జరిగే సమావేశంలో ప్రధానంగా బ్యాంకు పనిదినాలపైనే ఫోకస్ ఉంటుందని తెలుస్తోంది. బ్యాంకుల పనిదినాలను వారానికి 5 రోజులే పరిమితం చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదని రీసెంట్‎గా కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే ఐబీఏ కూడా తన ప్రతిపాదనలను సర్కార్‎కు పంపినట్లు తెలుస్తోంది. వారంలో ఒకరోజు పని తగ్గుతుండటం వల్ల , దీనికి బదులుగా 5 రోజుల పాటు, ఎంప్లాస్ ప్రతి రోజూ అదనంగా మరో 40 నిమిషాల పాటు పని చేయాల్సి ఉంటుందన్న అంశాన్ని ఐబీఏ తెరపైకి తీసుకువస్తోంది.



Updated : 22 July 2023 8:26 AM IST
Tags:    
Next Story
Share it
Top