Home > జాతీయం > విద్యార్థులకు గుడ్‌న్యూస్..అమెరికా ఎఫ్ 1 వీసా స్లాట్లు విడుదల

విద్యార్థులకు గుడ్‌న్యూస్..అమెరికా ఎఫ్ 1 వీసా స్లాట్లు విడుదల

విద్యార్థులకు గుడ్‌న్యూస్..అమెరికా ఎఫ్ 1 వీసా స్లాట్లు విడుదల
X

అగ్రరాజ్యం అమెరికా భారతీయ విద్యార్థులకు శుభవార్త అందించింది. తమ దేశానికి రావాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. US కాలేజీలో చదువుకోవడానికి స్టూడెంట్ ఎఫ్ 1 వీసా ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్‌ స్లాట్లు విడుదలయ్యాయి. జులై - ఆగస్టు మధ్య నెలలకు సంబంధించి ఈ స్లాట్స్‎ను విడుదల చేశారు. ustraveldocs.com వెబ్ సైట్‌లో అభ్యర్థులు స్లాట్స్ బుక్ చేసుకోవాలని అమెరికన్‌ ఎంబసీ ప్రకటించింది.

గతేడాది 1.25 లక్షల మంది భారత విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ చేసింది. ఈసారి కూడా అదే స్థాయిలో వీసాలు జారీ చేసే అవకాశం ఉంది. అమెరికాకు భారతీయ విద్యార్థులే ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్తారు. అందుకుతగ్గుటుగానే అమెరికా వీసాలను ఇండియన్ విద్యార్థులకు జారీ చేస్తోంది. అమెరికాలోని విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం రెండుసార్లు ప్రవేశాలకు అనుమతించగా..ఆగస్టు-డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలో భారతీయలు పయనమవుతారు. F1 వీసా ఇంటర్వ్యూలు ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతాల్లో జరుగుతాయి.









Updated : 19 Jun 2023 5:20 PM IST
Tags:    
Next Story
Share it
Top