Home > జాతీయం > MODI : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..యాక్సిడెంట్స్ తగ్గించేందుకు

MODI : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..యాక్సిడెంట్స్ తగ్గించేందుకు

MODI : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..యాక్సిడెంట్స్ తగ్గించేందుకు
X

దేశంలోని ట్రక్కు డ్రైవర్లకు ప్రధాని మోదీ తీపికబురు తెలిపారు. ప్రతిసారి సుదూర ప్రాంతాలకు డ్రైవింగ్‌ చేసే డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా బిల్డింగ్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో పాల్గొన్న ఆయన ట్రక్కు డ్రైవర్లకు ఈ గుడ్‌న్యూస్ చెప్పారు. ట్రక్కు డ్రైవర్ల కోసం నేషనల్ హైవేల వెంబడి అత్యాధునిక సౌకర్యాలతో భవనాలను నిర్మించనున్నట్లు ప్రధాని చెప్పారు. ఈ భవనాలు లక్షలాది ట్రక్కు డ్రైవర్లకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. హైవేలలో వందలు, వేల కిలోమీటర్ల పాటు సరకు, ఇతర వస్తువులను రవాణా చేసే డ్రైవర్లు నిర్వారమంగా ట్రక్కులను నడుపుతుంటారని... వారికి నిద్ర, విరామం ఉండదని యాక్సిడెంట్స్ అవి ప్రధాన కారణమని చెప్పారు. అయితే, అలాంటి ట్రక్ డ్రైవర్ల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని నేషనల్ హైవేలపై ప్రత్యేక భవనాలు నిర్మించనున్నట్లు మోదీ ప్రకటించారు.

సుదూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు సరైన విశ్రాంతి తీసుకునేలా వెయ్యి బిల్డింగ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ భవనాల్లో ఆహారం, నీరు, వాష్‌రూమ్స్, పార్కింగ్, విశ్రాంతి గదులతో పాటు మెరుగైన సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మిస్తామని తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థలో వాహన రంగం చాలా కీలకమైన పాత్ర వహిస్తుందని ప్రధాని చెప్పారు. అందుకే డ్రైవర్లే కారణమని తెలిపారు. అలాంటిది విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రధాని గుర్తు చేశారు. అలాంటి వారి కోసమే ఈ భవనాలు నిర్మిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు.




Updated : 3 Feb 2024 11:18 AM IST
Tags:    
Next Story
Share it
Top