Home > జాతీయం > గూగుల్లో మళ్లీ వందల ఉద్యోగాలు ఊస్ట్.. ఈసారి ఎవరంటే..?

గూగుల్లో మళ్లీ వందల ఉద్యోగాలు ఊస్ట్.. ఈసారి ఎవరంటే..?

గూగుల్లో మళ్లీ వందల ఉద్యోగాలు ఊస్ట్.. ఈసారి ఎవరంటే..?
X

టెక్ జెయింట్ గూగుల్ మళ్లీ ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. మరోసారి వందలాది మందిని తొలగించేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ సారి డిజిటల్ అసిస్టెంట్, హార్ట్వేర్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. కాస్ట్ కట్టింగ్లో భాగంగానే గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే ఉద్యోగులపై ఈ కోతల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

2023 జులై నుంచి గూగుల్ సంస్థాగతంగా పలు మార్పులు చేసింది. కంపెనీ పనితీరును మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించింది. ఆ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా కొందరు ఉద్యోగుల్ని తొలగించకతప్పడం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే హార్ట్వేర్ టీం నుంచి ఉద్వాసనకు గురైన ఉద్యోగులు గూగుల్లోని ఇతర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.

ఇదిలా ఉంటే గూగుల్ నిర్ణయాన్ని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా తప్పుబట్టింది. వినియోగదారులకు అత్యుత్తమమైన ప్రొడక్ట్స్ అందించేందుకు తమ సభ్యులు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రతి క్వార్టర్లో బిలియన్ల డాలర్ల ఆదాయం తెచ్చిపెడుతున్నా.. కంపెనీ వారిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తోందని మండిపడింది. తమ సభ్యులకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ స్పష్టం చేసింది.

Updated : 11 Jan 2024 1:26 PM IST
Tags:    
Next Story
Share it
Top