Home > జాతీయం > Google Pay : గూగుల్ కీలక ప్రకటన ..సేవలు నిలిపివేత!

Google Pay : గూగుల్ కీలక ప్రకటన ..సేవలు నిలిపివేత!

Google Pay : గూగుల్ కీలక ప్రకటన ..సేవలు నిలిపివేత!
X

డిజిటల్ పేమెంట్ యాప్‌లల్లో గూగుల్ పేకు ముందంజలో ఉంది. తమ యూజర్లకు ఈ యాప్ రకరకాల ఫీచర్లను అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం 180 దేశాల్లో గూగుల్ పే తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ సంస్థ ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గూగుల్ పే సేవలను నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అయితే అన్ని దేశాల్లో కాదు. కేవలం అమెరికాలో మాత్రమే తన సేవలను నిలిపివేస్తున్నట్లుగా గూగుల్ స్పష్టం చేసింది. 2024 జూన్ 4వ తేది నుంచి అమెరికాలో గూగుల్ పే సేవలు ఆగిపోనున్నాయి. దానివల్ల అమెరికాలోని గూగుల్ పే యూజర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

గూగుల్ పే సేవలను అమెరికాలో నిలిపివేసేందుకు ఓ కారణం ఉందని గూగుల్ తెలిపింది. గూగుల్ వాలెట్‌ను అమెరికా ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. పేమెంట్ కార్డులను ఈ యాప్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసేటప్పుడు కూడా ట్యాప్ అండ్ పే పద్ధతిలో సులభంగానే పేమెంట్ చేయొచ్చు. అంతేకాకుండా వివిధ కార్డులను, డ్రైవింగ్ లైసెన్సులను, ఐడీ కార్డులు లాంటి డిజిటల్ డాక్యుమెంట్లను గూగుల్ వాలెట్‌లో భద్రంగా ఉంచుకోవచ్చు.

ప్రస్తుతం అమెరికా మార్కెట్లో గూగుల్ పే కన్నా గూగుల్ వాలెట్ ఐదురెట్లు ప్రజాదరణను పొందింది. గూగుల్‌లో ఉండే ఫీచర్లన్నీ కూడా గూగుల్ వాలెట్‌లో ఉన్నాయి. దీంతో ఆ కారణంగానే గూగుల్ పేను అమెరికా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. జూన్ 4వ తేది వరకూ గూగుల్ పే సేవలను యూజర్లు పూర్తిగా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఆ సేవలు ఉండవని తెలిపింది. ఇకపోతే భారత్, సింగపూర్ దేశాల్లో ఎటువంటి మార్పులు ఉండవని, ఆ దేశాల్లో లక్షలాది మంది గూగుల్ పే సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మరికొన్ని ఫీచర్లను గూగుల్ పే యాప్‌లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ సంస్థ వెల్లడించింది.

Updated : 28 Feb 2024 6:51 PM IST
Tags:    
Next Story
Share it
Top