Home > జాతీయం > Aha : గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'ఆహా' యాప్ ఔట్

Aha : గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'ఆహా' యాప్ ఔట్

Aha : గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆహా యాప్ ఔట్
X

భారతీయ కంపెనీలకు చెందిన పలు యాప్‌లకు గూగుల్ షాకిచ్చింది. ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్‌లను తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది. మొదట 10 కంపెనీలకు చెందిన యాప్‌లను ప్లే స్టోర్ తొలగించింది. తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీకి చెందిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'ను కూడా గూగుల్ ప్లేస్టోర్ నుంచి తీసేసింది. దీంతో ఆ యాప్ ఇప్పుడు ప్లే స్టోర్‌లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని 'ఆహా' మేనేజ్‌మెంట్ కూడా స్పష్టం చేసింది.

బిల్లింగ్ నిబంధనలు పాటించని కొన్ని యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లుగా గూగుల్ చెప్పుకొచ్చింది. సర్వీస్‌లకు పేమెంట్లు చెల్లించనందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో తమ యాప్ అందుబాటులో లేదని ఆహా కూడా ప్రకటించింది. ఇప్పటికే ఈ యాప్ వాడుతున్నవారికి ఏ ఇబ్బంది లేదని, అయితే కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారికి యాప్ డౌన్లోడ్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆహా టీమ్ చెప్పుకొచ్చింది.

ఇకపోతే గూగుల్ ఇప్పటి వరకూ 11 యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అందులో భారత్ మాట్రిమోనీ, కూకూ ఎఫ్ఎం, నౌకరి, షాదీ.కామ్, 99ఏకర్స్, ఆల్ట్ బాలాజీ, ట్రూలీ మాడ్లీ, క్వాక్ క్వాక్, స్టేజ్, స్టేజ్ ఓటీటీ యాప్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆహా యాప్‌ను కూడా ప్లేస్టోర్ తీసేసింది. ఈ యాప్ సంస్థలన్నీ గూగుల్‌కు ఫీజులు చెల్లించలేదు. అందుకే గూగుల్ వీటిని ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Updated : 2 March 2024 12:43 PM GMT
Tags:    
Next Story
Share it
Top