Home > జాతీయం > Bank employees : ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఇక ఐదు రోజులే పనిదినాలు !

Bank employees : ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఇక ఐదు రోజులే పనిదినాలు !

Bank employees  : ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఇక ఐదు రోజులే పనిదినాలు !
X

బ్యాంకు ఉద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. తమ ఎంప్లాయీస్‌కు ఐదు రోజుల పనికి అనుమతించనున్నారు. ఈ విధానానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దాంతోపాటే శాలరీ హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్థికమంత్రిత్వశాఖ ఇందుకు ఆమోదం తెలిపితే జూన్ నెల నుంచే ఐదు రోజుల పనిదినాలు అమల్లోకి వస్తుంది. బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు గతంలో లేఖ రాసింది. బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు కల్పించాలన్న డిమాండ్ 2015 నుంచి ఉంది. ప్రస్తుతం నెలలో ప్రతి రెండు, నాలుగో శనివారం బ్యాంకులు సెలవు పాటిస్తున్నాయి.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య గతేడాది జరిగిన ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు వేతనం 17 శాతం పెరిగింది. సెంట్రల్ అమోదిస్తే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు రంగంలో 3.8 లక్షలమంది అధికారులు సహా 9 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులకు వారానికి రెండు రోజుల వీక్లీ ఆఫ్, వేతన పెంపు ఫలాలు అందుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకూ ఇది వర్తిస్తుంది. ఐదు రోజుల పని వల్ల వినియోగదారులకు సేవలు అందించే పని గంటలు తగ్గిపోవని, అలాగే ఉద్యోగులు, అధికారుల మొత్తం పనిగంటల్లోనూ ఎలాంటి మార్పులు ఉండవని అందులో హామీ ఇచ్చింది. ఐదు రోజుల పనిదినాలు ఇప్పటికే ఆర్బీఐ, ఎల్ఐసీలో అమల్లో ఉన్నాయని, కాబట్టి ఈ విషయాన్ని సమీక్షించి తమకు అనుకూలంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. గతంలో దీనిపై సమ్మె కూడా నిర్వహించారు. దీంతో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్‌లు కూడా ఈ నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది.




Updated : 2 March 2024 5:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top