Home > జాతీయం > అనూహ్య నిర్ణయం.. సెప్టెంబర్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

అనూహ్య నిర్ణయం.. సెప్టెంబర్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

అనూహ్య నిర్ణయం.. సెప్టెంబర్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
X

మోడీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు స్పెషల్ సెషన్ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

ప్రత్యేక సమావేశాల్లో భాగంగా పార్లమెంటు 5 రోజుల పాటు కొలువుదీరనుంది. అయితే ఈ స్పెషల్ సెషన్ ఎజెండా ఏంటన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. పాత బిల్డింగ్ నుంచి పార్లమెంటు కొత్త భవనంలోకి మారేందుకే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది జాయింట్ సెషన్ అయి ఉంటుందని అంటున్నారు. అమృత్ కాల్ సెలబ్రేషన్స్, అభివృద్ధి చెందిన దేశం అంశాలు అజెండాగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అయితే ఈ సెషన్ లో ఎలాంటి కీలక బిల్లులు ప్రవేశపెట్టకపోవచ్చని సమాచారం.

ఇదిలా ఉంటే మోడీ సర్కారు నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సెప్టెంబర్ మూడో వారంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడాన్ని తప్పుబడుతున్నాయి. గణేశ్ చవితి సమయంలో సభ నిర్వహించడం ఏంటని ఎన్సీపీ ప్రశ్నిస్తోంది.


Updated : 31 Aug 2023 2:37 PM GMT
Tags:    
Next Story
Share it
Top