Home > టెక్నాలజీ > గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక

గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక

గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక
X

భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఇటీవల (Google Chrome) యూజర్లకు హై రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. CERT-In గూగుల్ క్రోమ్ నిర్దిష్ట వెర్షన్లలో అనేక బగ్స్ ఉన్నాయని హెచ్చరించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీగా (CERT-In) బ్రౌజర్ భద్రతా ప్రమాదాల గురించి క్రోమ్ యూజర్లను హెచ్చరిచ్చింది.

కొన్ని వెర్షన్లకు ఫిషింగ్‌, డాటా దాడులు, మాల్‌వేర్‌ ఇన్‌ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉన్నదని వెల్లడించింది.ప్రాంప్ట్స్‌, వెబ్‌ పేమెంట్స్‌ ఏపీఐ, వీడియో, వెబ్‌ ఆర్‌టీసీ ఫీచర్లకు ప్రమాదం కలగవచ్చని.. వెంటనే క్రోమ్‌ తాజా వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. హానికరమైన వెబ్‌సైట్లను యూజర్లు సందర్శిస్తే వారి కంప్యూటర్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లి వారి వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉన్నదని పేర్కొంది.వినియోగదారులు జాగ్రత్తగా ఉండటంతో పాటు తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపింది.

CERT-In ఈ లోపాలను కలిగి ఉన్న గూగుల్ క్రోమ్ ప్రభావిత వెర్షన్‌లను రివీల్ చేసింది. Linux, Mac యూజర్లు 115.0.5790.170కి ముందున్నగూగుల్ క్రోమ్ వెర్షన్లలో Windows కోసం 115.0.5790.170/.171కి ముందు క్రోమ్ వెర్షన్లతో అప్‌డేట్ చేసుకోవాలి. తమ సిస్టమ్‌లను ప్రొటెక్ట్ చేసుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి.

మీ డివైజ్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి :

మీ సిస్టమ్‌లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి గూగుల్ క్రోమ్ వీలైనంత త్వరగా లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలని CERT-In వినియోగదారులకు సూచిస్తోంది. ఈ లోపాలను పరిష్కరించడానికి గూగుల్ ఇప్పటికే ఒక కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది.

గూగుల్ క్రోమ్ అప్‌డేట్ చేయాలంటే? :

గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి.

విండో రైట్ టాప్ కార్నర్‌లో మూడు చుక్కలను క్లిక్ చేయండి.

Help> Google Chrome > About ఎంచుకోండి.

అప్‌డేట్ అందుబాటులో ఉంటే.. Chrome దాన్ని ఆటోమాటిక్‌గా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంది.

Update ఇన్‌స్టాల్ చేసిన తర్వాత క్రోమ్ రీస్టార్ట్ అవుతుంది.

మీరు ఈ దశలను ఫాలో చేయడం ద్వారా అప్‌డేట్‌ల కోసం మాన్యువల్‌గా కూడా చెక్ చేయవచ్చు.




Updated : 11 Aug 2023 9:16 AM IST
Tags:    
Next Story
Share it
Top