Home > జాతీయం > Tamilisai : ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్..!

Tamilisai : ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్..!

Tamilisai  : ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్..!
X

ఎంపీ ఎన్నికల్లో భాగంగా దక్షణాది రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ సెట్టింది. ఎక్కువ సీట్లను గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. బీజేపీకి దక్షిణాదిలో అంతగా పట్టులేదు. ఒక్క రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలో లేదు. ఈ సారి ఎలాగైన దక్షణాదిలోనూ ఎక్కువ సీట్లు సాధించాలని ప్లాన్ వేస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు, గవర్నర్ను సైతం ఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళనాడుకు చెందిన తమిళిసై ఎంపీ ఎన్నికల బరిలో నిలుస్తారని సమాచారం.

2019లో ఆమె తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కుమార్తె. 1999లో బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గానూ పనిచేశారు. ఆ రాష్ట్రంలో బీజేపీ బలోపేతంలో ఆమెది కీలక పాత్ర. ఇప్పటికే పలుసార్లు ఎన్నికల బరిలో నిలిచిన తమిళిసై ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

2006 అసెంబ్లీ ఎన్నికల్లో రామనాథపురం నుంచి తమిళిసై పోటీ చేసి ఓడిపోయారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ చెన్నై నుంచి పోటీ చేయగా.. అప్పుడూ ఓటమే ఎదురైంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వేళచ్చేరి నుంచి బరిలో నిలిచి నాలుగో స్థానంలో నిలిచారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కనిమొళి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కేంద్రం ఆమెను తెలంగాణ గవర్నర్‌గా నియమించింది. అప్పటినుంచి ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఇటీవల తమిళిసై హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీపై షాతో చర్చించినట్లు తెలుస్తోంది. ముందుగా పుదుచ్చేరి నుంచి పోటీ చేయాలని ఆమె భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ అక్కడ కూటమిలో ఉండడంతో కూటమి అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి. ఇదే అంశంపై సీఎం రంగస్వామితో చర్చించాలని ఆమె ప్రయత్నించినా అది కుదరలేదు. ఈ క్రమంలో తమిళనాడు నుంచే పోటీ చేయాలని ఆమె ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇటీవల చెన్నైలో వరదలు రాగా తమిళిసై పర్యటించి బాధితులకు సాయం అందించారు. అప్పుడు డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


Updated : 6 Feb 2024 2:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top