జమిలి ఎన్నికల కమిటీ సభ్యులను ప్రకటించిన కేంద్రం
X
మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా దూకుడు పెంచింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం ప్రకటించిన ప్రభుత్వం శుక్రవారం ఆగమేఘాల మీద కమిటీ వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కమిటీ సభ్యులను కేంద్రం ప్రకటించింది. ఈ కమిటీలో అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరీ, గులాంనబీ ఆజాద్, ఎన్కే సింగ్, సుభాష్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారిలను సభ్యులుగా నియమించింది.
ఈ కమిటీ ఈ నెల 17లోపు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో కేంద్రం ‘‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’’ బిల్లును ప్రవేశపెట్టి రాజ్యాంగ అధికరణను సవరిస్తారని వార్తలు వస్తున్నాయి. జమిలి ఎన్నికల అంశాన్ని లా కమిషన్ పరిశీలిస్తున్న క్రమంలో కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కమిటీకి స్వపక్ష నేతే సారథ్యం వహిస్తుండడంతో నివేదిక జమిలి ఎన్నికలకు అనుకూలంగానే వస్తుందని భావిస్తున్నారు.
జమిలి ఎన్నికలు దేశానికి కొత్త కాదని బీజేపీ నేతలు చరిత్రను గుర్తు చేస్తున్నారు. 1967 వరకు దాకా పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలోనే నిర్వహించేవారు. 1960 దశకం చివరల్లో కాంగ్రెస్ పాలిటిక్స్ మార్క్ వల్ల కొన్ని అసెంబ్లీలను రద్దు చేశాక అవి గాడి తప్పాయి. 1971లో లోక్సభకు తొలిసారి ముందస్తు ఎన్నికలు జరిపారు. తర్వాత పాలు పార్టీలు చీలిపోవడం, ఆయారాం గయారాంల సంస్కృతి పెరగడం, అసెంబ్లీలను రద్దు చేసుకునే అవకాశం పార్టీలకు ఉండడంతో జమిలి ఎన్నికలు సాధ్యం కాలేదు.
Govt of India constitutes 8-member committee to examine ‘One nation, One election’.
— ANI (@ANI) September 2, 2023
Former President Ram Nath Kovind appointed as Chairman of the committee. Union Home Minister Amit Shah, Congress MP Adhir Ranjan Chowdhury, Former Rajya Sabha LoP Ghulam Nabi Azad, and others… pic.twitter.com/Sk9sptonp0