Home > జాతీయం > Delhi : నాలుగో రోజు కొనసాగుతున్న రైతుల ఢిల్లీ చలో

Delhi : నాలుగో రోజు కొనసాగుతున్న రైతుల ఢిల్లీ చలో

Delhi  : నాలుగో రోజు కొనసాగుతున్న రైతుల ఢిల్లీ చలో
X

దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం ఇవాళ నాలుగో రోజుకు చేరుకుంది. పంజాబ్, హరియాణా సరిహద్దులు రైతుల ధర్నాలతో అట్టుడికాయి. ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. శంభు, ఖనౌరీల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పహారా కాసారు. ఢిల్లీలోనూ శాంతియుత పరిస్థితులు ఏర్పాడ్డాయి. గురువారం రైతు సంఘాలు రైల్‌రోకో చేపట్టడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. అంతేగాక టోల్‌ప్లాజాలవద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. చర్చల్లో మంత్రులు అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్‌, నిత్యానంద్‌ రాయ్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, రైతు సంఘాల నేతలు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌, శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ పాల్గొన్నారు.





ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు శంభు, ఖనౌరీల వద్ద వేల మంది రైతులు, పోలీసులు మోహరించి ఉన్నారు. తాము బారికేడ్లను తొలగించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదని అన్నదాతలు తెలిపారు. అమృత్‌సర్‌, ఢిల్లీ మార్గంలో పట్టాలపై రైతులు బైఠాయించి ధర్నాకు దిగడంతో.. 4 గంటలపాటు రైళ్లు ఆగిపోయాయి. అయితే మరికొన్ని మార్గాల్లో రైళ్లను దారి మళ్లించారు. ఢిల్లీ, బహదూర్‌గఢ్‌ సరిహద్దులను పోలీసులు మూసి వేశారు. పంజాబ్‌లోని పటియాలా, సంగ్రూర్‌, ఫతేగఢ్‌ సాహిబ్‌ జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను ఆపేశారు. తమతో చర్చలు జరిపే మంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడాలని కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ డిమాండ్ చేశారు. ఢిల్లీ చలో ఆందోళనకు మద్దతుగా ఇవాళ గ్రామీణ భారత్‌ బంద్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. దీనికి పలు పార్టీలు, సంఘాలు మద్దతుగా నిలిచాయి. బంద్‌ నేపథ్యంలో నొయిడాలో 144 సెక్షన్‌ విధించారు పోలీసులు.







Updated : 16 Feb 2024 1:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top