బెట్టింగ్ బాబులకు షాక్.. ఆన్‌లైన్ గేమ్స్‌పై 28 శాతం పన్ను, ఓడినా కట్టాల్సిందే
X
కేరళతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే లాటరీ నిర్వహిస్తుంటాయి. జాక్ పాట్ వీరుల నుంచి 30 శాతం పన్నును ముక్కుపిండి వసూలు చేస్తుంటాయి. లక్ష లాటరీలో తగిలితే 30 వేలు ప్రభుత్వానికే ఇవ్వాలి. ఈజీ మనీపై ఈజీగా దండుకుంటున్న ఈ విధానాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా అనుసరించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ గేమ్స్ సొమ్ముపై 28 శాతం వసూలు చేయాలని మంగళవారం సమావేశమై జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. గేమింగ్ ముఖవిలువపై (బెట్టింగ్ అమౌంట్) ఈ సొమ్మును వసూలు చేస్తారు. గేమ్‌లో ఓడిపోయినా సరే పన్ను కక్కాల్సి ఉంటుంది.
ఆన్లైన్ గేమింగ్ విషయంలో గేమ్ ఆఫ్ స్కిల్(నైపుణ్యతో ఆడ్ గేమ్), గేమ్ ఆఫ్ చాన్స్(అదృష్టం ఆధారపడిన గేమ్) తేడాలను పరిగణనలోకి తీసుకోకుండా పన్ను వేయాలని జీఎస్టీ నిర్ణయింది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేల 28 శాతం పన్ను వసూలు చేస్తారు. ఈ పన్నుపోటుతో గేమింట్ ఇండస్ట్రీ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా దేశంలో ఈ పన్ను 18 శాతం మాత్రమే ఉందని, 28 శాతం పరిశ్రమకు చావుదెబ్బేనని అశోక్ గుప్తా అనే న్యాయవాది చెరప్పారు. అయితే పన్ను వల్ల మరిం పారదర్శకత ఉంటుందని, మోసాలు జరగవని కేంద్రం చెబుతోంది. కాగా, అరుదైన వ్యాధులతో బాధపడేవారికి అందించే ఆహారం, కేన్సర్‌కు వాడే డైనటుక్సిమాబ్ మందులపై పన్నును జీఎస్టీ కౌన్సిల్ రద్దు చేసింది.
Online gaming, horse racing and casinos will be taxed. They will be taxed at 28 percent on full face value
— PIB India (@PIB_India) July 11, 2023
- Union Minister @nsitharaman #GSTCouncilMeeting pic.twitter.com/KYrNIHPP1b