Home > జాతీయం > క్రికెట్ బాల్ పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు

క్రికెట్ బాల్ పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు

క్రికెట్ బాల్ పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు
X

దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. ఇంకా అగ్రవర్ణాల చేతుల్లో దళితులు మగ్గిపోతున్నారు. తాజాగా గుజరాత్లో జరిగిన ఓ అమానవీయ ఘటన అందరినీ కలచివేసింది. గుజరాత్, పటాన్ జిల్లాలోని కాకోశీ గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామంలోని స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. అది చూడటానికి ఓ దళిత బాలుడు, అతని మేనమామ ధీరజ్ వస్తారు. బౌండరీ వద్దకు వచ్చిన బాల్ను ఆ బాలుడు పట్టుకుని.. గ్రౌండ్లోకి విసిరాడు. అది చూసిన అగ్రకులస్థులు.. ధీరజ్తో గొడవ పడి, తీవ్రంగా దూషించారు. కుల పరవగా తిడుతూ అవమానపరిచారు. అక్కడున్న వాళ్లు సర్ది చెప్పడంతో గొడవ అక్కడితో సర్దు మనిగింది.

అదే రోజు రాత్రి గ్రౌండ్లో గొడవపడ్డ అగ్ర కులస్థులు.. మరికొందరిని తీసుకుని ధీరజ్ ఇంటికి వచ్చారు. కత్తులు, రాడ్లతో.. ధీరజ్, అతని సోదరుడు కీర్తిపై దాడికి చేశారు. ఈ గొడవలో కీర్తి చేతి బొటనవేలును నరికి వాళ్లతో తీసుకెళ్లారు. గాయపడ్డవాళ్లను హాస్పిటల్ తరలించారు స్థానికులు. తర్వాత ధీరజ్, అతని సోదరుడు కీర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 326, 506.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Updated : 5 Jun 2023 9:59 PM IST
Tags:    
Next Story
Share it
Top