ఆడు మగాడురా బుజ్జి...సింహానికి ఎదురెళ్లి ఆవును రక్షించాడు
X
మూగజీవాలపై ప్రేమ అందరికీ ఉంటుంది. చాలా మంది కంటికి రెప్పలా, కన్నపిల్లల్లా వాటిని పోషిస్తుంటారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, రైతులు పశువులను వారి కుటుంబసభ్యులుగా భావిస్తారు. ఆవులు, గేదెలను పెంచుతూ..వాటిపై ఆధారపడి జీవిస్తుంటారు. అందుకేనేమో తమను జీవనాధారమైన పశువులకు ఆపద వస్తే ఓ రైతు పెద్ద ప్రమాదానికే ఎదురెల్లి దానిని కాపాడాడు. గుజరాత్‌కు చెందిన ఓ రైతు సింహం నుంచి ఆవును కాపాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు రైతు ధైర్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు.
గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా అలీదార్ ప్రాంతంలో జరిగిన ఈ అరుదైన సంఘటను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేశోడ్ కార్పొరేటన్ వివేక్ కొటాడియా.వీడియోలో ఓ ఆడ సింహం ఆవుపై దాడి చేసిన దృష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆవు గొంతును పట్టుకుని దానిని వేటాడే ప్రయత్నం చేసింది. సింహం పట్టుకు పాపాం ఆవు నొప్పితో విలవిల్లాడిపోయింది. పెద్దగా అరుస్తోంది. ఆవు అరుపులు విన్న రైతు వెంటనే పరుగెత్తుకొని ఆవు దగ్గరకు వచ్చాడు. ఎలాగైనా తన జీవనాధారమైన ఆవును కాపాడుకోవాలనుకుని సింహానికే ఎదురెల్లాడు. చెయ్యెత్తి అరుస్తూ సింహాన్నే భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయినా అది ఆవును వదల్లేదు. దీంతో రోడ్డు పక్కనే పడివున్న రాయిని తీసుకుని సింహం మీదకు రైతు వెళ్లాడు, దీంతో సింహం రైతును చూసి భయపడి ఆవును వదిలి పొలాల్లో నుంచి అడవిలోకి పారిపోయింది. ఈ వీడియోలో రైతు తెగువను, ఆవుపైవున్న ప్రేమను చూసి నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆడు మగాడురా బుజ్జీ అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.
ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ.
— Vivek Kotadiya🇮🇳 BJP (@VivekKotdiya) June 29, 2023
ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.