Home > జాతీయం > ఇకపై ప్రేమపెళ్లిళ్లకు తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి..!

ఇకపై ప్రేమపెళ్లిళ్లకు తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి..!

ఇకపై ప్రేమపెళ్లిళ్లకు తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి..!
X

ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రేమపెళ్లిళ్లు సర్వసాధారణంగా మారాయి. కుటుంబసభ్యులు ఒప్పుకుంటే ఒకే.. లేకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటున్నారు ప్రేమికులు. అయితే ఇటువంటి పెళ్లిళ్లపై గుజరాత్ సర్కార్ నజర్ పెట్టింది. ప్రేమపెళ్లికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ ఓ జీవో తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

ఈ అంశంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.

గుజరాత్ పటీదార్‌ సామాజికవర్గంలోని ఒక వర్గం ప్రేమపెళ్లికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం భూపేంద్ర పటేల్ ఈ విధంగా స్పందించారు. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల ఆమోదం ఉండాలన్న అంశానికి రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉందా? లేదా? అన్నది పరిశీలిస్తామని చెప్పారు. ఈ ప్రకటపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదేవాలా సానుకూలంగా స్పందించారు.

ప్రభుత్వం ఇటువంటి చట్టం తెస్తే కాంగ్రెస్ మద్ధతు ఉంటుందని ఎమ్మెల్యే ఇమ్రాన్ చెప్పారు. ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన అంశంమని అన్నారు. పిల్లలను పెంచేది తల్లిదండ్రులే కాబట్టి వారి అంగీకారం తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు. ఇక గుజరాత్ సర్కార్ 2021లో మత స్వేచ్ఛ చట్టాన్ని సవరించింది. ఈ చట్టం ప్రకారం పెళ్లి సమయంలో బలవంతపు మతమార్పిడికి పాల్పడితే 10ఏళ్ల జైళ్లు శిక్ష విధించేలా సవరించగా.. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది.

Updated : 1 Aug 2023 1:51 PM IST
Tags:    
Next Story
Share it
Top