Home > జాతీయం > ఎయిరిండియా ప్రయాణికులకు.. ఖలిస్థాన్ ఉగ్రవాది హెచ్చరికలు

ఎయిరిండియా ప్రయాణికులకు.. ఖలిస్థాన్ ఉగ్రవాది హెచ్చరికలు

ఎయిరిండియా ప్రయాణికులకు.. ఖలిస్థాన్ ఉగ్రవాది హెచ్చరికలు
X

ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉందని ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత్ లోని సిక్కులెవరూ నవంబర్ 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దని గురుపత్వంత్ సింగ్ వీడియో ద్వారా హెచ్చరించాడు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను మూసేసి, దాని పేరు కూడా మారుస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా అదే రోజునే వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా జరబోతుందని వీడియో ప్రస్తావించాడు.

ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌- పాలస్తీనా పరిస్థితులను చూసి నేర్చుకోవాలని, లేదంటే భారత్ లో కూడా అలాంటి పరిణామాలే ఎదురవుతాయని అక్టోబర్ 10న సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పాలస్తీనాలోనే కాదు భారత్ లో కూడా హింస జరుగుతుంది అంటూ వీడియో రిలీజ్ చేశాడు. 2007లో గురుపత్వంత్ సింగ్ పన్నూ.. సిఖ్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థను ఏర్పాటు చేశాడు. దాన్ని 2019లో భారత్ లో నిషేదించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల చట్టం ప్రకారం భారత ప్రభుత్వం గురుపత్వంత్ సింగ్ ను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.

Updated : 5 Nov 2023 8:13 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top