మొదలైన జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే
మొదలైన జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే
X
వివాస్పదంగా మారిన వారణాసి జ్ఞానవాపి మసీద్ లో మొత్తానికి ఆర్కియాలజీ సర్వే మొదలైంది. ఈరోజు సర్వే ఉంటుందని ముందుగానే అనౌన్స్ చేశారు. దీంతో ముందుగా పోలీసులు బృందం ఆ మసీదులోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత అర్కియాలజికల్ అధికారులు అక్కడికి వచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీల్ వేసినటువంటి ప్రాంతాన్ని మాత్రం ప్రస్తుతం చేపడుతున్న సర్వే నుంచి మినహాయింపు ఇచ్చారు.
జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నుంచి మొత్తం 30 మంది పురావస్తు శాఖ సభ్యలు బృందం సర్వే చేస్తోంది. వీరితో పాటూ పిటిషన్ల తరుఫు న్యాయవాదులు కూడా ఉన్నారు. మొఘల్ కాలంలో నిర్మించబడిన గుడి స్థానంలో మసీదు నిర్మించారని నలుగురు హిందూ మహిళలు పిటిషన్లు వేశారు. వాజుఖానా ఆకారం బయటపడటంతో అది శివలింగమని హిందు సంఘాలు వాదించాయి. అయితే మసీది కమిటీ అది నీటి కొలను నిర్మాణమని వాదించింది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య పరస్పర వాదనలు, విమర్శలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్థానిక కోర్టు వెంటనే సర్వే చేపట్టాలంటూ పురావస్తు శాఖకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వేను పూర్తి చేసి ఆగస్టు 4వ తేదిన జిల్లా కోర్టుకు అర్కియలాజికల్ అధికారులు తమ నివేదికను అందించనున్నారు.
మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది. మరోవైపు శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటి సుప్రీంకోర్టును ఆశ్రయించి వెంటనే విచారణ చేపట్టాలని కోరింది. ఈ పిటిషన్ సోమవారం చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ ముందుకు రానుంది.