ఢిల్లీ నుంచి రాగానే.. ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
Mic Tv Desk | 5 July 2023 2:00 PM IST
X
X
బీజేపీ నాయకులు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన.. గజ్వేల్ వెళ్తుండగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత అల్వాట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల గజ్వేల్ లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివాజీ విగ్రహం వద్ద ఓ వ్యక్తి మూత్రం పోయడంతో.. స్థానిక నేతలు ఆ వ్యక్తిని చితకొట్టారు. ఈ నేపథ్యంలో బాధిత హిందూ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తున్న రఘునందన్ ను.. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated : 5 July 2023 2:00 PM IST
Tags: telangana ts politics MLA Raghunandan Rao bjp siddiipet hakimpet police Raghunandan Rao arrest hyderabad siddipet shivaji statue fight
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire