వేలమందిలో సెక్యూరిటీ లేకుండా తిరిగిన సీఎం.. వీడియో
X
వీలైతే వార్డ్ మెంబర్ కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కోరుకునే అత్యంత అభద్రత కాలం ఇది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, సీఎం, పీఎం.. మరే ప్రజాప్రతినిధి అయినా సరే తుపాకుల రక్షణ లేకుండా ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఇది. ప్రాణభయం, నియమ నిబంధనలు దీనికి కారణం. అయితే ఓ ముఖ్యమంత్రి మాత్రం ఐ డోన్ట్ కేర్ అంటూ వేలమంది ప్రజల మధ్య ఎలాంటి సెక్యూరిటీ లేకుండా చక్కర్లు కొట్టారు. వాచ్‌మెన్‌లా ఖాకీరంగు దుస్తులు ధరించి, ముఖానికి మఫ్లర్ కట్టుకని జనం మధ్య అటూ ఇటూ తిరిగారు. అతి సామాన్యంగా ఉండడంతో జనం ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈ సాహసం చేశారు. పంచకులాలోని షాలిమర్ మైదానంతో జరుగుతున్న మేళాకు ఆయన మంగళవారం మారువేషంలో వెళ్లారు. వాచ్‌మెన్ వేషంలో జనం మధ్య చక్కర్లు కొట్టారు. చిప్స్ ప్యాకెట్ కొనుక్కుని తింటూ అటూ ఇటూ తిరిగారు. చాలాసేపు మేళాలో తిరిగినా, కొన్నిసార్లు కండువా తీసేసినా ఒక్కరు కూడా ముఖ్యమంత్రిని గుర్తుపట్టలేదు. వీడియోలో ఉన్నది ఖట్టరేనని సీఎం మీడియా కార్యదర్శి నిర్ధారించారు. అయితే సీఎం ఎందుకలా జనంలోకి వెళ్లారో స్పష్టంగా తెలియడం లేదు. ప్రజల నాడిని, రాజకీయాలపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికే అలా వెళ్లినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
हरियाणा के मुख्यमंत्री मनोहर लाल खट्टर पंचकूला के सेक्टर-5 के दशहरा ग्राउंड में मेला देखने के लिए पहुंचे। यह दावा उनके एक वीडियो को लेकर किया जा रहा है। सीएम इस वीडियो में बिना सिक्योरिटी के मेले में घूमते नजर आ रहे हैं।#ManoharLalKhattar #haryana pic.twitter.com/1Z17xXgdZB
— Parmeet Bidowali (@ParmeetBidowali) November 8, 2023