Home > జాతీయం > కాంగ్రెస్ అవినీతి చిట్టా పెన్ డ్రైవ్లో దాచిపెట్టిన : మాజీ సీఎం

కాంగ్రెస్ అవినీతి చిట్టా పెన్ డ్రైవ్లో దాచిపెట్టిన : మాజీ సీఎం

కాంగ్రెస్ అవినీతి చిట్టా పెన్ డ్రైవ్లో దాచిపెట్టిన : మాజీ సీఎం
X

కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్ మధ్య అగ్గి రాజుకుంది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 14 నెలలకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలో మాజీ సీఎం కుమారస్వామిపై కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేయగా.. కాంగ్రెస్ అవినీతిపై కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని చెప్పారు.

కుమారస్వామి సీఎంగా ఉన్నప్పుడు తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌ను తన అక్రమాలకు అడ్డాగా వాడుకున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఎవరు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే చిట్టా తన వద్ద ఉందని చెప్పారు. కాంగ్రెస్ ఎటువంటి ఆధారాల్లేకుండా మాట్లాడుతుందని.. కానీ కాంగ్రెస్ నేతల అవినీతికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ తన వద్దే ఉన్నాయని కుమారస్వామి స్పష్టం చేశారు.

‘‘నేను సాక్ష్యాలను జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. ఎప్పుడైనా దాన్ని బయటకు తీస్తా. సరైన సమాచారం లేకుండా ఏదీ విడుదల చేయను. ఆఫీసర్ల పోస్టింగ్‌ల కోసం బాధ్యత కలిగిన మంత్రి ఎలా డబ్బులు తీసుకుంటారు? అదంతా ఇందులో ఉంది’’ అంటూ ఓ పెన్‌డ్రైవ్‌ను జేబులో నుంచి తీసి చూపించారు. డీకే శివకుమార్ గతంలో తన కేబినెట్‌లో మంత్రిగా పని చేశారని, అధికారులను బదిలీ చేయడానికి పెద్ద ఎత్తున లంచాలను తీసుకున్నారని కుమారస్వామి ఆరోపించారు.

Updated : 5 July 2023 4:43 PM IST
Tags:    
Next Story
Share it
Top