Home > జాతీయం > వచ్చే నెల HDFC బ్యాంకు విలీనం.. ఎందుకంటే..!

వచ్చే నెల HDFC బ్యాంకు విలీనం.. ఎందుకంటే..!

వచ్చే నెల HDFC బ్యాంకు విలీనం.. ఎందుకంటే..!
X

దిగ్గజ ఆర్థిక సంస్థలుగా కొనసాగుతున్న హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం కానుంది. జులై 1 నుంచి ఈ విలీనం అమలవుతుందని హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. జూన్ 30న ఇరు సంస్థల బోర్డులు సమావేశమై విలీనానికి ఆమోదం తెలుపనున్నాయి. హెచ్డీఎఫ్సీ స్టాక్ డీలిస్టింగ్ ప్రక్రియ జులై 13 నుంచి మొదలవుతుంది. హెచ్డీఎఫ్సీ.. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనానికి ఏప్రిల్ 4న మొదట బీజం పడింది.

ఏప్రిల్ నుంచి హెచ్డీఎఫ్సీ విలీనానికి సెబీ, సీసీఐ, ఆర్బీఐ సంస్థల ఆమోదం కోసం ప్రయత్నాలు జరుపుతుంటే.. దానికి తాజాగా ఆమోదం లభించిందని హెచ్డీఎఫ్సీ సీఈఓ కేకే మిస్త్రీ తెలిపారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విలీనం అని దీని విలువ 40 బిలియన్ డాలర్లు అని వెల్లడించారు. ఈ విలీనం తర్వాత రెండు సంస్థల ఆస్తుల విలువ రూ. 18 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఈ విలీనం తర్వాతం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీకి 41శాతం వాటా దక్కుతుంది.

Updated : 27 Jun 2023 5:01 PM IST
Tags:    
Next Story
Share it
Top