హృదయాలను హత్తుకునే దృశ్యం..కోడలి కోసం ఓ అత్త సాహసం
X
అత్తా కోడళ్ల మధ్య సంబంధం అనగానే మన సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఓ ఇంప్రెషన్ ఏర్పడింది. ఏ ఇంటి తలుపు తట్టినా అత్తా కోడళ్ళ మధ్య గొడవలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. అత్తాకోడళ్లు అంటే ఎప్పుడు తిట్టుకుంటూ, గొడవలు పడుతూ ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఇంటిని రణరంగంగా మార్చుతుంటారు. కొంతమంది అత్తాకోడళ్లు అయితే ఏకంగా ఏళ్ల తరబడి మాటా మంచి లేకుండా ఉంటుంటారు. అయితే ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని..అత్త గుండెలో కూడా అమ్మ ఉన్నదని.. రాశారు ఓ సినీ కవి. ఆ మాటను నిజ జీవితంలో చేసి చూపించింది ఓ అత్త. తన కోడలి కోసం ఏ అత్తా చేయలేని త్యాగం చేసి తన మాతృత్వాన్ని నిరూపించుకుంది. అత్త సాహసాన్ని చూసి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 70 ఏళ్ల ప్రభా కాంతిలాల్ మోటాకు ఓ కొడుకు ఉన్నాడు. అతనికి అమిషా మోటాతో చాన్నాళ్ల క్రితమే పెళ్లైంది. అయితే 43 ఏళ్ల అమిషాకు హఠాత్తుగా తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చింది. అలా ఓ రోజు ఆమెను హాస్పిటల్కు తరలించగా కిడ్నీపాడైందని వైద్యులు ధ్రువీకరించారు. కిడ్నీ మార్చాలని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దీంతో అమిషా మోటా భర్త జితేష్ ఆమెకు కిడ్నీ డొనేట్ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే అతనికి షుగర్ వ్యాధి ఉండటంతో వైద్యులు నిరాకరించారు.ఈ విషయం తెలిసుకున్న ప్రభా కాంతిలాల్ మోటా మంచి మనసుతో , కోడలిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే ఆమె వయసు 70 ఏళ్లు కావడంతో ముందుగా కుటుంబ సభ్యులు వద్దన్నారు. వైద్యులు సైతం ఆలోచించుకోవాలన్నారు. అయినా అవేమి పట్టించుకోకుండా ఆమె కిడ్నీని కోడలికి ఇస్తానని తేల్చి చెప్పింది. నా కోడలు కూతురు లాంటిదని.. తన బిడ్డ ఆరోగ్యం కన్నా తనకు ఏది ముఖ్యం కాదని అత్త చెప్పడంతో అందరి హృదయాలు చలించిపోయాయి. తన కోడలి కోసం అత్త కిడ్నీ త్యాగం చేసింది.
కిడ్నీ ఇచ్చిన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అత్తకు ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అత్తంటే ఇలా ఉండాలంటూ నెజిన్స్ ఆమె చేసిన సాహసానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
देशातील अतिशय दुर्मिळ घटना आमच्या सत्यम् टॉवर सोसायटीमध्ये घडली. मोटा परिवारातील सून अमिषा जितेष मोटा (४३) यांच्या दोन्ही किडन्या निकामी झाल्या असता प्रभा कांतीलाल मोटा (७०) या त्यांच्या सासूची किडनी जुळली व सासूने आनंदाने सूनेला किडनी दान केली. मंगळवारी नानावटीला ऑपरेशन झाले.१/२ pic.twitter.com/HZSR79npih
— Sachin Sawant सचिन सावंत (@sachin_inc) August 5, 2023