Home > జాతీయం > పాకిస్తాన్ వాళ్లు మనం అనుకున్నట్లు కాదు: బిన్నీ

పాకిస్తాన్ వాళ్లు మనం అనుకున్నట్లు కాదు: బిన్నీ

పాకిస్తాన్ వాళ్లు మనం అనుకున్నట్లు కాదు: బిన్నీ
X

ఆసియా కప్ 2023కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్ పెద్దలు, అన్ని దేశాల బోర్డ్ సభ్యులు పాకిస్తాన్ సందర్శించారు. వాళ్ల ఆతిథ్యాన్ని స్వీకరించి, అక్కడ జరిగిన మ్యాచులన్నీ ప్రత్యక్షంగా వీక్షించారు. కాగా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పాక్ పై సానుకూలంగా స్పందించారు. పాక్ పర్యటన తనకు సంతృప్తినిచ్చిందన్నారు. రెండు దేశాల మధ్య క్రికెట్ వారధిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.





బుధవారం (సెప్టెంబర్ 6) బిన్నీ, రాజీవ్ శుక్లా కలిసి అటారి- వాఘా బార్డర్ ద్వారా భారత్ చేరుకున్నారు. ఇద్దరు బీసీసీఐ కార్యవర్గ సభ్యులు కలిసి పాక్ పర్యటించడం గత 17 ఏళ్లలో ఇదే మొదటిసారి. కాగా స్వదేశానికి తిరిగొచ్చిన బిన్నీ ‘పాకిస్తాన్ లో మాకు లభించిన ఆప్యాయత, స్నేహపూర్వక ఆదరణ ఆనందాన్నిచ్చింది. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. వివిధ విషయాలపై చర్చించాం. ఇదో మంచి పర్యటనగా నిలిచింది’ అని వివరించారు.




Updated : 7 Sept 2023 10:37 AM IST
Tags:    
Next Story
Share it
Top