బావిలో భారీ దున్నపోతు... టెన్షన్‌తో ఇలా.. వీడియో
X
అడవుల్లో తిరిగే భారీ దున్నపోతు ఊరికొచ్చింది. దాహం తీర్చుకుందామనో లేకపోతే లోపల ఏముందో చూద్దామనో వ్యవసాయ బావిలో పడిపోయింది. 25 అడుగుల లోతున్న బావిలో పడి ప్రాణం పోయేలా ఆర్తనాదాలు చేసింది. దున్నతో పాటు పందుల అరుపులు కూడా వినిపించాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక సామాగ్రి వెంటబెట్టుకుని వచ్చారు. దున్నను ఎలా బయటికి తీయాలో దిక్కుతోచలేదు. లోపలికి దిగి తాళ్లతో కట్టే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఆఖరి ప్రయత్నింగా మత్తుమందు ప్రయోగించారు. బావిలోకి తాళ్లు దింపి దున్నను కట్టేసి క్రేన్ సాయంతో బయటికి తీసుకొచ్చారు. మత్తుమందు ఇచ్చినా డోస్ సరిపోక దున్న తోక కదిలింది. దీంతో భయంభయంగా దాన్ని బయటికొచ్చి నేలపైన పడేశారు. భయంభయంగానే తట్టి లేపారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన దున్న చుట్టుపక్కల పరిసరాలను చూసి తల విదిలచుకుంది. పోలీసులు, స్థానికులు దాని నిం కాపాడుకోవడానికి దాక్కున్నారు. తర్వాత అటూ అటూ తిరిగి అడవుల్లోకి వెళ్లిపోయింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిందీ సంఘటన. చిప్పలి లింగదహళ్లి గ్రామంలోని వ్యవసాయ బావిలో బుధవారం దున్నతోపాటు రెండు పందులు కూడా పడిపోయాయి. దున్నతోపాటు వాటినీ బయటికి తీశారు.
ಶಿವಮೊಗ್ಗ ಜಿಲ್ಲೆಯ ಸಾಗರ ತಾಲೂಕಿನ ಚಿಪ್ಲಿ ಲಿಂಗದಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸುಮಾರು 60 ಅಡಿ ಆಳದ ಬಾವಿ ಒಂದಕ್ಕೆ ಕಾಡುಕೋಣದ ಮರಿ ಬಿದ್ದಿದೆ. ಘಟನಾ ಸ್ಥಳಕ್ಕೆ ಅಗ್ನಿ ಶಾಮಕ ದಳ ದೌಡಾಯಿಸಿ ಕಾಡುಕೋಣವನ್ನ ರಕ್ಷಣೆ ಮಾಡಿದ್ದಾರೆ.#newsfirstlive #newsfirstkannada #KannadaNews #shivamogga pic.twitter.com/1oXhOWrVqk
— NewsFirst Kannada (@NewsFirstKan) August 10, 2023