Home > జాతీయం > వెదర్ అలర్ట్.. తమిళనాడులో వారం పాటు అతి భారీ వర్షాలు..

వెదర్ అలర్ట్.. తమిళనాడులో వారం పాటు అతి భారీ వర్షాలు..

వెదర్ అలర్ట్.. తమిళనాడులో వారం పాటు అతి భారీ వర్షాలు..
X

తమిళనాడును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. మిజాంగ్ తుఫాను సృష్టించిన విలయం నుంచి కోలుకోకముందే వరుణుడు మళ్లీ ప్రకోపం చూపుతున్నాడు. ఉదయం నుంచి చెన్నై సహా పలు ప్రాంతాలను భారీగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే వారం రోజుల పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఈ క్రమంలోనే శనివారం తూత్తుకుడి, రామనాథపురం, పడుక్కోటై, శివగంగ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కన్యాకుమారి, తిరునల్వేలి, తంజావూర్, తిరువారూర్, నాగపట్టినం, మధురై, విరుదు నగర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

మరోవైపు డిసెంబర్‌ 17న కేరళ, లక్షద్వీప్‌ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.




Updated : 15 Dec 2023 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top