ఒడిశాలో భారీ వర్షాలు.. పిడుగులు పడి 10మంది మృతి
X
ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు ప్రజలను భయపెడుతున్నాయి. భారీ వర్షానికి తోడు పిడుగులు పడడంతో 10మంది చనిపోయారు. ఖుర్దా జిల్లాలో నలుగురు, బోలన్‌గిర్‌లో ఇద్దరు, అంగుల్, బౌద్, జగత్‌సింగ్‌పూర్, దేన్‌కనల్ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు. ఖుర్దా జిల్లాలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరో నాలుగు రోజులపాటు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని.. ఇవాళ ఉత్తర బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీన్ని ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఇక భువనేశ్వర్, కటక్ నగరాల్లో కేవలం 90 నిమిషాల్లోనే 126 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.