చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. స్కూళ్లకుసెలవులు
X
చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది. ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్లు, వెల్లూరు, రాణిపేట జిల్లాల్లో వర్షం దంచి కొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో చెన్నైతోపాటు చుట్టు పక్కల జిల్లాలోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మీనంబాక్కం ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో 137.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.
భారీ వర్షంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చైన్నై నుంచి వెళ్లాల్సిన పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆలస్యంగా బయలుదేరాయి. ఇక పలు విమానాలను బెంగళూరుకు మళ్లించారు.ఇవాళ సాయంత్రం వరకు చైన్నైలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే కొన్ని రోజుల నుంచి భారీ ఎండలతో అల్లాడిన ప్రజలు.. ప్రస్తుతం కురుస్తోన్న భారీ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు.