Home > జాతీయం > ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. తెలుగు యాత్రికుల ఇబ్బందులు..

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. తెలుగు యాత్రికుల ఇబ్బందులు..

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. తెలుగు యాత్రికుల ఇబ్బందులు..
X

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం అవుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొండచరియలు విరిగిపడడంతో పర్యాటకులు భయాందోళన చెందుతున్నారు. భారీ వర్షాల వల్ల ఇప్పటివరకు 31మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం వరకు వర్షాలు పడుతాయని తెలిపిన వాతావరణ శాఖ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.





భారీ వర్షాలతో పర్యాటకులు నానాతిప్పలు పడుతున్నారు. కొడియాల వద్ద దాదాపు 1500 వాహనాలు నిలిచపోగా.. దాదాపు 20వేల మంది చిక్కుకపోయారు. సుమారు 40 కి.మీ మేర యాత్రికులు, స్థానికులు పడిగాపులు కాస్తున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు నుంచి వెళ్లిన యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. తమవారి గురించి సరైన సమాచారం తెలియకపోవడంతో యాత్రికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తగిన చర్యలు చేపట్టి.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.





ఇక డెహ్రడూన్ తో పాటు ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు కేదార్‌నాథ్ యాత్ర మార్గంలోని గౌరీకుండ్ సమీపంలో వరదలు సంభవించాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్హ్వాల్, కుమావోన్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది.





Updated : 8 Aug 2023 3:55 PM IST
Tags:    
Next Story
Share it
Top