ఆరుగురితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్
X
నేపాల్‌లో ఓ హెలికాప్టర్ జాడ గల్లంతైంది. ఆ సమయంలో దానిలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఐదుగురు విదేశీయులే. ఈ హెలికాప్టర్ సోలుకుంబులోని సుర్కి నుంచి ఖాట్మాండూకు ప్రయాణిస్తుండగా దాని ఆచూకీ అదృశ్యమైంది. హెలికాప్టర్ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో డిస్‌కనెక్ట్ అయిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం హెలికాప్టర్‌తో కాంటాక్ట్ నెలకొల్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Manang Air helicopter 9N-AMV (AS 50) which departed from Surke (Solukhumbu) to Kathmandu at 10:05 local time is out of contact.
— Civil Aviation Authority of Nepal (@hello_CAANepal) July 11, 2023
Total persons on board: 6
(5 passengers + 1 captain).
Altitude Air helicopter departed from Kathmandu for search and rescue.
హెలికాప్టర్ అదృశ్యం కాగానే రంగంలోకి దిగిన అధికారులు దానిని వెతికేందుకు ఓ హెలికాప్టర్‌ను పంపారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే దానితో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వివరించింది. మంగళవారం ఉదయం 9:45 గంటలకు హెలికాప్టర్ బయలుదేరిందని నేపాల్ పౌర విమానయాన అథారిటీ సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ జనరల్ మేనేజర్ ప్రతాప్ బాబు తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. 9N-AMV అనే కాల్ సైన్ ఉన్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకు గ్రౌండ్‌తో కాంటాక్ట్ కోల్పోయింది. ఈ మేరకు ఖాట్మాండూ పోస్టు రిపోర్ట్ చేసింది. ఇక, కనిపించుకుండా పోయిన హెలికాప్టర్‌లోని ఆరుగురిలో.. కెప్టెన్ చెట్ బహదూర్ గురుంగ్ కూడా ఉన్నారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.