Home > జాతీయం > Champai Soren: మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్.. కొత్త సీఎంగా 'జార్ఖండ్ టైగర్'

Champai Soren: మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్.. కొత్త సీఎంగా 'జార్ఖండ్ టైగర్'

Champai Soren: మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్..  కొత్త సీఎంగా జార్ఖండ్ టైగర్
X

జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్​కు అందజేశారు. సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసినట్లు మంత్రి బన్నా గుప్తా తెలిపారు. ఇక జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయనను శాసనసభా పక్ష నేతగా జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలు ఎంచుకున్నట్లు బన్నా గుప్తా తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవం కోసం గవర్నర్‌ను అభ్యర్థించడానికి రాజ్‌భవన్‌కు వెళ్లినట్లు ఆయన చెప్పారు. చంపై సోరెన్‌ సెరైకెల్లా నియోజవకర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జేఎంఎంలో చేరకమముందు ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేగానూ ఎన్నికై సేవలందించారు.

చంపై సోరెన్ జిల్లింగగోడ గ్రామంలోని గిరిజన నివాసి సిమల్ సోరెన్.. నలుగురు పిల్లలలో ఒకరు. చంపై సోరెన్..సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు. చంపై కూడా తన తండ్రితోపాటు వ్యవసాయం చేశాడు. చంపై ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. చంపైకి చిన్న వయస్సులోనే మాంకోతో వివాహం జరిగింది. వారికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చంపై బీహార్ నుండి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ జరిగిన ఉద్యమంలో శిబు సోరెన్‌తో కలిసి పాల్గొన్నాడు. జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయన్ను.. జార్ఖండ్‌ టైగర్‌ గా పిలిచేవారు.

సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. ఈ పరిస్థితుల్లో ఆయన భార్య కల్పనా సోరెన్‌కు (Kalpana Soren)కు సీఎం పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలు చంపై సోరెన్ ను శాసనసభా పక్షనేతగా బుధవారం రాత్రి ఎన్నుకున్నారు. దాంతో ఝార్ఖండ్ నూతన సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ వీడింది. మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ ఈడీ విచారణతో ఝార్ఖండ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు, రాజకీయ హైడ్రామా నడుమ మధ్యాహ్నం నుంచి దాదాపు ఆరు గంటలకు పైగా హేమంత్‌ను ఈడీ అధికారులు విచారించారు. హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. జార్ఖండ్‌ సీఎం విచారణ ఈడీ విచారణ నేపథ్యంలో రాంచీలోని రాజ్‌భవన్, సీఎం నివాసం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ను విధించారు. సీఎం సోరెన్ నివాసం ఆవరణలోకి రెండు మినీ బస్సులు తీసుకువచ్చారు. అలాగే పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు.

Updated : 31 Jan 2024 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top