Home > జాతీయం > Hero Xtreme 125R vs TVS Raider 125 : ఒకటి 66 కి.మీ మైలేజ్.. మరొకటి 57 కి.మి మైలేజ్. రెండిట్లో ఏ బైక్ కొనాలి?

Hero Xtreme 125R vs TVS Raider 125 : ఒకటి 66 కి.మీ మైలేజ్.. మరొకటి 57 కి.మి మైలేజ్. రెండిట్లో ఏ బైక్ కొనాలి?

Hero Xtreme 125R vs TVS Raider 125 : ఒకటి 66 కి.మీ మైలేజ్.. మరొకటి 57 కి.మి మైలేజ్. రెండిట్లో ఏ బైక్ కొనాలి?
X

మిడిల్ క్లాస్ బడ్జెట్ వారికి తక్కువ ప్రైజ్ లో.. మంచి ఫీచర్స్, కిల్లింగ్ లుక్, స్పోర్ట్స్ ఫీచర్స్ తో బైక్ కావాలని చాలామంది చూస్తుంటారు. వారికోసమే హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్, టీవీఎస్ రైడర్ 125 బైక్స్ లాంచ్ అయ్యాయి. మార్కెట్ లో మంచి హైప్ ను క్రియేట్ చేసుకున్న ఈ బైక్స్ ను కొనడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు పూర్తి కొత్తగా 125cc సెగ్మెంట్ లో కొత్త బైక్స్ ను రెండు కంపెనీలు విడుదల చేశాయి. అగ్రెసివ్ డిజైన్, స్టైలిష్ లుక్స్‌తో కంపెనీలు కొత్తగా 125cc బైక్ లను లాంచ్ చేశాయి. అత్యంత అధునాతన ఫీచర్స్ తో వస్తున్న ఈ బైక్స్ ను కొనేందుకు ఇండియన్ మార్కెట్ లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఏ బైక్ తీసుకోవాలనే కన్ ఫ్యూజన్ లో ఉండిపోతున్నారు. అలాంటి వారికోసం ఈ రెండు బైక్ ల కంపారిజన్..

Hero Xtreme 125R specifications:

ఇందులోని ప్రొజెక్టర్ హెడ్ లైట్, స్లిమ్ LED టర్న్ ఇండికేటర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ బైక్ ను ఇంజిన్ బ్యాలెన్సర్ టెక్నాలజీతో, స్మూత్ పవర్ రెస్పాన్స్, ఇన్ స్టంట్ టార్క్ తో 125 సీసీ మోటార్ ను తయారుచేశారు. ఈ ఇంజిన్ 11.4బీహెచ్‌పీని అందిస్తుంది. 5.9 సెకన్స్ లో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కాగా చాలామంది దీని మైలేజ్ చూసి కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ బైక్ లీటర్ కు 66 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. 276mm ఫ్రంట్ డిస్క్‌తో సెగ్మెంట్ ఫస్ట్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ కలిగి ఉంది. వీటితో పాటు ఎల్ఈడీ వింకర్‌లు, టైలాంప్, కాంపాక్ట్ మఫ్లర్, సెగ్మెంట్ ఫస్ట్ వీల్ కవర్ ఉన్నాయి. దీని ధర.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఐబీఎస్- రూ. 95,000 ఉండగా.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఏబీఎస్ - రూ. 99,500 ఉంది.

TVS raider 125 specifications:

టీవీఎస్​ రైడర్​ 125లో స్కల్ప్​టెడ్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, సరికొత్త ఆల్​- ఎల్​ఈడీ లైటింగ్​ సెటప్ ఉంటుంది. వీటితోపాటు డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ తో వస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రేర్ లో డ్రమ్ బ్రేక్ తో వస్తాయి. కంబైన్స్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. ఫ్రంట్ లో టెలిస్కోపిక ఫోర్క్స్స, రేర్ లో మోనో షాక్ యూనిట్స్ ఉంటాయి. ఈ బైక్ 14.8 సీసీ, ఎయిర్​ అండ్​ ఆయిల్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ తో వస్తుంది. 15.3 హార్స్ పవర్, 11.2 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. టీవీఎస్​ రైడర్​ 125 ఎక్స్​షోరూం ధర రూ. 95,200- రూ. 1.03లక్షల మధ్యలో ఉంటుంది.

Updated : 6 Feb 2024 8:59 PM IST
Tags:    
Next Story
Share it
Top