Home > జాతీయం > Uttarakhand : ఉత్తరాఖండ్ లో హై ఎలర్ట్...షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ

Uttarakhand : ఉత్తరాఖండ్ లో హై ఎలర్ట్...షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ

Uttarakhand : ఉత్తరాఖండ్ లో హై ఎలర్ట్...షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ
X

ఉత్తరాఖండ్ (Uttarakhand)లో హై ఎలర్ట్ కొనసాగుతుంది. పలు హింసాత్మక (Violence) ఘటనలతో నిన్న రాత్రి నుంచి ఉత్తరాఖండ్ అట్టుడుకుతోంది. హల్ద్వానీలో అక్రమ కట్టడాలు కూల్చేందుకు వచ్చిన అధికారులు, పోలీసుల సిబ్బంది పై అక్కడి స్థానికులు ఆందోళనకు దిగి వారిపై దాడి చేశారు. ఈ ఘర్షణలో నలుగురు మృతి చెందారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్థానికంగా అక్కడ కర్ఫ్యూ విధించారు.

హల్ద్వానీలోని బాన్‌భూల్‌పురాలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలిగించాలని ఇటీవల కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసుల భారీ భద్రత నడుమ మున్సిపల్ అధికారుల సహయంతో అక్కడ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలపై ఆగ్రహానికి గురైన స్థానికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. ప్రజలు కంట్రోల్ తప్పి కూల్చివేతల వద్ద ఉన్న బారికేడ్లను విరగొట్టారు. ఆగ్రహాంతో పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది పై రాళ్లు విసిరారు.

ఇది కాస్తా ఉద్రిక్తతలకు దారితీయడంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో నిరసనకారులు పదుల సంఖ్యలో పోలీసు వాహనాలను ధ్వంసం చేసి.. పోలీస్‌ స్టేషన్‌ను తగలపెట్టారు. ఈ పరిస్థితిపై అప్రమత్తమైన పోలీసులు హల్ద్వానీలో కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు చనిపోగా.. 250 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పోలీసులు, మున్సిపల్‌ అధికారులే ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లర్లు అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. షూట్‌ ఎట్‌ సైట్‌ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఘర్షణల నేపథ్యంలో హల్ద్వానీలో స్కూళ్లకు బంద్ ప్రకటించారు. అంతేగాక ఉత్తరాఖండ్‌ వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు.

Updated : 9 Feb 2024 1:26 PM IST
Tags:    
Next Story
Share it
Top