Home > జాతీయం > కర్ణాటక సీఎంకు షాక్.. జరిమాన విధించిన హైకోర్టు

కర్ణాటక సీఎంకు షాక్.. జరిమాన విధించిన హైకోర్టు

కర్ణాటక సీఎంకు షాక్.. జరిమాన విధించిన హైకోర్టు
X

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. 2022లో జరిగిన నిరసనల్లో సీఎం సిద్దరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు రోడ్డు బ్లాక్ చేశారంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగారెడ్డిలకు ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయల చొప్పున జరిమాన విధించారు. మార్చి 6న సీఎం సిద్ధరామయ్య, 7న రవాణామంత్రి రామలింగారెడ్డి, 11న రణదీప్‌ సూర్జేవాలా, 15న మంత్రి ఎంబీ పాటిల్‌ కోర్టులో హాజరుకావాలని తెలిపింది. అయితే, బెలగావికి చెందిన కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఉడిపిలోని ఓ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే, కాంట్రాక్టు పనులు చేయగా.. బిల్లులు చెల్లించేందుకు మంత్రి ఈశ్వరప్ప కమీషన్‌ డిమాండ్‌ చేశారని మృతుడు సంతోష్‌ పాటిల్‌ ఆరోపించాడు. ఆ తర్వాత ఈశ్వరప్ప ఆరోపణలను ఖండించడంతో పాటు పరువు నష్టం కేసు పెట్టారు. కాంట్రాక్టర్‌ ఆత్మహత్య కేసులో కేఎస్‌ ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ అప్పటి బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు 2022 ఏప్రిల్‌లో ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య సహా కాంగ్రెస్‌ నేతలు నిరసన చేపట్టారు. అప్పటి మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై ఇంటిని ఘెరావ్‌ చేసేందుకు మార్చ్‌ నిర్వహించారు. నిరసన నేపథ్యంలో భారీగా రోడ్లను బ్లాక్‌ చేయాల్సి వచ్చింది. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది. దీనిపై కాంగ్రెస్‌ నేతలపై కేసు నమోదైంది.

Updated : 19 Feb 2024 4:28 PM IST
Tags:    
Next Story
Share it
Top