Home > జాతీయం > Delhi : ఈనెల 16న భారత్ బంద్..కేంద్రం తీరుకు నిరసనగా పిలుపునిచ్చిన రైతుసంఘాలు

Delhi : ఈనెల 16న భారత్ బంద్..కేంద్రం తీరుకు నిరసనగా పిలుపునిచ్చిన రైతుసంఘాలు

Delhi   : ఈనెల 16న భారత్ బంద్..కేంద్రం తీరుకు నిరసనగా పిలుపునిచ్చిన రైతుసంఘాలు
X

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రెండో రోజు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులంతా కలిసి ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు. రాజధానిలో ఆందోలనలకు దిగారు. నిన్న కేంద్ర బలగాలు ఢిల్లీని తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. రైతులను అడ్డుకునేందుకు 144 సెక్షన్ అమలు చేసిన రోడ్లపై బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అంతేగాక రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అయితే ఆందోళనల్లో పాల్గొనేందుకు మరి కొంత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.





అయితే ఢిల్లీ చేరుకున్న రైతులు రాత్రంతా రోడ్లపైనే గడిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారి కోసం రోడ్ల పైనే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడిన తాము మాత్రం డిమాండ్లను తీర్చేవరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. అయితే, రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని, వాటిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని వారికి విజ్ఞప్తి చేశారు. మరోసారి చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించినట్లు చెప్పారు. మరోవైపు వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత స్వామినాథన్‌ కూతురు మధుర రైతుల ఆందోళనలపై స్పందించారు. డిమాండ్ల పరిష్కారం కోసం నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ చేసి జైళ్లకు తరలిస్తారని వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు. వాళ్లేం నేరస్థులు కారని, అన్నదాతలని...వారితో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. అయితే రైతులకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’ కార్యక్రమానికి కాంగ్రెస్‌ (Congress) మద్దతు ప్రకటించింది. కేంద్రం తీరును నిరసిస్తూ ఈనెల 16న భారత్ బంద్ కు రైతుసంఘాలు పిలుపునిచ్చాయి.


Updated : 14 Feb 2024 6:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top