Home > జాతీయం > sindu : రైల్వే టికెట్ ఇన్‌‌స్పెక్టర్‌గా హిజ్రా..సౌత్ ఇండియాలోనే తొలిసారిగా!

sindu : రైల్వే టికెట్ ఇన్‌‌స్పెక్టర్‌గా హిజ్రా..సౌత్ ఇండియాలోనే తొలిసారిగా!

sindu  : రైల్వే టికెట్ ఇన్‌‌స్పెక్టర్‌గా హిజ్రా..సౌత్ ఇండియాలోనే తొలిసారిగా!
X

ఇటీవలి కాలంలో హిజ్రాలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. కొంత ప్రోత్సహాం ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపిస్తున్నారు. జనరేషన్ మారుతుడడంతో ట్రాన్స్ జెండర్ లకు ప్రాధాన్యం పెరుగుతోంది. అన్ని రంగాల్లో తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూ వాళ్ల సత్తా చాటుతున్నారు. తాజాగా ఓ హిజ్రా రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. సౌత్ ఇండియాలోనే తొలి టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా రికార్డు నెలకొల్పింది.

తమిళ లిటరేచర్ లో బి.లిట్ చేసిన నాగర్‌కోవిల్‌కు చెందిన సింధు 19 ఏళ్ల క్రితం కేరళలోని ఎర్నాకుళంలోని రైల్వేశాఖలో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి తమిళనాడులోని దిండుక్కల్ వచ్చారు. అనుకొని ఓ ప్రమాదంలో ఆమె చేయికి తీవ్ర గాయం కావడంతో ఆమెను కామర్స్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తూనే ఆమె టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా ట్రెనింగ్ పూర్తిచేసుకున్నారు. దీంతో ఆమెను తాజాగా దిండుక్కల్ రైల్వే డివిజన్‌లో టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. దీంతో సౌత్ లోనే తొలి రైల్వే ఇన్‌స్పెక్టర్‌గా రికార్డులకెక్కారు.

ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ తాను హిజ్రా కావడంతో ఏమీ సాధించలేనన్న నిరుత్సాహం నుంచి ఈస్థాయికి ఎదిగినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. తన జీవితంలో ఇది ఒక మర్చిపోలేని జ్ఞాపకమని ఆనందం వ్యక్తం చేశారు. హిజ్రాలు తమ సమస్యలతో కుంగిపోకుండా విద్య, శ్రమను ఆయుధాలుగా చేసుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని సింధు సూచించారు.




Updated : 10 Feb 2024 5:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top