Sukhvinder Singh Sukhu : రాజకీయ సంక్షోభం.. సీఎం పదవికి సుఖ్విందర్ రాజీనామా
X
హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. రాజ్యసభలో ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా మలుపుతిరిగాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగింది. సీఎం మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సుఖ్విందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం సీఎల్పీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు.
కాగా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. ఇద్దరి అభ్యర్థులకు 34 ఓట్లు రావడంతో అధికారులు లాటరీ తీశారు. దీంట్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ విజయం సాధించగా.. అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ గవర్నర్ను బీజేపీ శాసనసభ పక్ష నేత జయరాం ఠాకూర్ కలిశారు. ప్రభుత్వాన్ని మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించాల్సింది గవర్నర్ను కోరారు. దీంతో హిమాచల్ రాజకీయాలు మరిన్ని మలుపులు తీసుకోనున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 40స్థానాల్లో గెలిపొందగా.. బీజేపీ 25, ఇండిపెండెంట్లు 3స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆరుగు ఎమ్మెల్యేలు బీజేపీ అనుకూలంగా ఓటేయడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 34కు పడిపోయింది. ఇండిపెండెంట్లతో కలుపుకుని అటు బీజేపీకి 34మంది సభ్యుల బలం ఉంది. దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తంగా సాగుతోన్నాయి. సీఎంను మార్చడంతో ఎమ్మెల్యేలను తిరిగి తమవైపుకు తిప్పుకుని బీజేపీకి కాంగ్రెస్ చెక్ పెడుతుందా అనేది వేచి చూడాలి.