50ఏళ్లుగా టమాటా సాగు.. ఇప్పుడు కోటీశ్వరుడు..
X
దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆ ధరలు వింటేనే ప్రజల గుండెలు అదురుతున్నాయి. కేజీ టమాటా ధర కొన్ని చోట్లా 200 రూపాయలకు పైగా పలుకుతోంది. గతంలో కేజీలకు కేజీలు కొన్న జనం ఇప్పుడు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. సామాన్యలను భయపెడుతున్న టమాటాలు రైతులకు మాత్రం మంచి లాభాలను తెచ్చిపెడ్తున్నాయి. టమాటాలు అమ్మి ఓ వ్యక్తి ఏకంగా కోటీశ్వరుడయ్యాడు.
దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు.. ఓ రైతును కోటీశ్వరుడిని చేశాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లా బాల్హ్ లోయకు చెందిన 67 ఏళ్ల జైరామ్ సైనీ సుమారు 37 ఎకరాల్లో టమాట పంట సాగు చేశాడు. ఇక్కసారిగా టమాటాల ధర పెరగడంతో కాసుల వర్షం కురిపించింది. దాదాపు 8,300 బాక్సులు అమ్మడం ద్వారా రూ.1.10 కోట్లు వచ్చాయి.
జైరామ్ గత 50 ఏళ్లుగా టమాటా పంట సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం మరో 500 పెట్టెలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు తాను పండించిన పంట బాగా దెబ్బతినిందని.. లేదంటే ఇప్పటికే 12వేల బాక్సుల టమాటాలను విక్రయించేవాడినని వివరించారు. గతేడాది ఇదే సమయంలో 10 వేల టమాటా బాక్సులు విక్రయించానని.. దానికి గాను రూ. 55 లక్షలు మాత్రమే వచ్చినట్లు సైనీ తెలిపారు. టమాటాలు రైతుల ఇంట పండుగ తెస్తే సామాన్యుల ఇంట ఇబ్బందులను తెచ్చింది.