Home > జాతీయం > Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కీలక నిర్ణయం..ఆరుగురిపై వేటు

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కీలక నిర్ణయం..ఆరుగురిపై వేటు

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కీలక నిర్ణయం..ఆరుగురిపై వేటు
X

హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరుగురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు పడింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ గుర్తు పై గెలిచి బీజేపీకి ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 34 పడిపోయింది.





క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా మండిపడ్డారు. వారిపై అనర్హత వేటు వేశారు. బీజేపీకి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రాజేందర్ రానా, ఇంద్రదత్ లఖన్‌పాల్, రవి ఠాకూర్, చైతన్య శర్మ, దేవేంద్ర భుట్టో పై వేటు వేశారు. ఆ ఆరుగురు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తక్షణమే సభ్యులుగా ఉండడాన్ని ఆపేసినట్లు ప్రకటించారు.




ప్రస్తుతం అక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 40స్థానాల్లో గెలిపొందగా.. బీజేపీ 25, ఇండిపెండెంట్లు 3స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆరుగు ఎమ్మెల్యేలు బీజేపీ అనుకూలంగా ఓటేయడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 34కు పడిపోయింది. ఇండిపెండెంట్లతో కలుపుకుని అటు బీజేపీకి 34మంది సభ్యుల బలం ఉంది. దీంతో బలపరీక్ష కోసం ఇప్పటికే గవర్నర్ ను బీజేపీ కోరింది.




Updated : 29 Feb 2024 6:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top