Home > జాతీయం > స్పీకర్ షాకింగ్ నిర్ణయం.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

స్పీకర్ షాకింగ్ నిర్ణయం.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

స్పీకర్ షాకింగ్ నిర్ణయం.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
X

హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ.. రాజ్యసభలో ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు. దీంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా మలుపుతిరిగాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగింది. సీఎం మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సుఖ్విందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారనే వార్తలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించారు. సీఎం పదవికి రాజీనామా చేయలేదని, పదవిలో కొనసాగుతానని చెప్పారు.

ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన వారి శాసనసభ సభ్యత్వాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వేటు పడిన ఎమ్మెల్యేల్లో సుధీర్ శర్మ, రాజేంద్ర రాణా, దేవేందర్ కె. భుట్టో, రవి ఠాకూర్, చైతన్య శర్మ, ఇందర్ దత్ లఖన్పాత్ ఉన్నారు.

కాగా బుధవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. ఇద్దరి అభ్యర్థులకు 34 ఓట్లు రావడంతో అధికారులు లాటరీ తీశారు. దీంట్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ విజయం సాధించగా.. అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ గవర్నర్ను బీజేపీ శాసనసభ పక్ష నేత జయరాం ఠాకూర్ కలిశారు. ప్రభుత్వాన్ని మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించాల్సింది గవర్నర్ను కోరారు. దీంతో హిమాచల్ రాజకీయాలు మరిన్ని మలుపులు తీసుకోనున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 40స్థానాల్లో గెలిపొందగా.. బీజేపీ 25, ఇండిపెండెంట్లు 3స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆరుగు ఎమ్మెల్యేలు బీజేపీ అనుకూలంగా ఓటేయడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 34కు పడిపోయింది. ఇండిపెండెంట్లతో కలుపుకుని అటు బీజేపీకి 34మంది సభ్యుల బలం ఉంది. దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తంగా సాగుతోన్నాయి. సీఎంను మార్చడంతో ఎమ్మెల్యేలను తిరిగి తమవైపుకు తిప్పుకుని బీజేపీకి కాంగ్రెస్ చెక్ పెడుతుందా అనేది వేచి చూడాలి.

Updated : 29 Feb 2024 4:54 PM IST
Tags:    
Next Story
Share it
Top