Himanta Biswa Sarma : బీజేపీ గెలిస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: అస్సాం సీఎం
X
రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు బీజేపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన మేనిఫెస్టోతో ప్రజలను ఆకర్శించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఎన్నికలకు ఇంకా వారం రోజులే గడువు ఉండటంతో.. క్యాంపెయినింగ్ లో జోరు పెంచింది. దేశంలోని బడా నేతలంతా తెలంగాణకు క్యూ కట్టారు. భారీ సభలు ఏర్పాటుచేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్ని హైదరాబాద్ లో పర్యటించిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామని హామీ ఇచ్చారు. చార్మినార్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన.. త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో మార్పు రావాలనుకుంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో శాంతి నెలకొందని, టెర్రరిస్టుల దాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ బాగుపడాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలని సూచించారు.